Dr.B.R.Ambedkar Open University: దూరవిద్యలో యూజీ, పీజీ, డిప్లొమా కోర్సులు 11 month ago
తెలుగు రాష్ట్రాల్లో దూర విద్యకు చిరునామా డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, కోరుకున్న కోర్సులు లభించటం, అభ్యసన కేంద్రాలు సమీపంలో ఉండటం, మెటీరియల్ నాణ్యత, తక్కువ ఫీజు... తదితర కారణాలతో ఈ సంస్ధ అందరికీ దగ్గరైంది. తెలుగు మీడియంలో పీజీ కోర్సులు అందించడం ఈ విశ్వవిద్యాలయం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ విశ్వవిద్యాలయం నుంచి ప్రకటన వెలువడుతుంది.
కోర్సులు:
ఎంఏః ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. వీటిలో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ కోర్సులను తెలుగు మాధ్యమంలోనే అందిస్తున్నారు. స్టడీ మెటీరియల్ కూడా తెలుగులోనే ఉంటుంది. అయితే పరీక్షలు మాత్రం తెలుగు/ఇంగ్లీష్‌లో రాసుకోవచ్చు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఆంగ్ల మాధ్యమంలోనే లభిస్తుంది. లాంగ్వేజీ కోర్సులు సంబంధిత భాషలో ఉంటాయి. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌కు మొదటి ఏడాది రూ. 7800. రెండో సంవత్సరానికి రూ. 7500. మిగతా అన్ని కోర్సుల ఫీజు మొదటి ఏడాదికి రూ. 5300. రెండో ఏడాదికి రూ. 5000. ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు.
ఈ కోర్సు కి విద్యార్హత ఏదైనా యూజీ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎమ్మెస్సీ:
మ్యాథ్స్, అప్లైడ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, సైకాలజీ, వ్యవధి రెండేళ్లు. ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. కెమిస్ట్రీకి మొదటి సంవత్సరం రూ. 18,300. రెండో ఏడాది రూ. 18000. మ్యాథ్స్‌కి రెండేళ్లూ వరుసగా రూ. 7800, 7500. మిగిలిన వాటికి మొదటి ఏడాదికి రూ. 15,300. రెండో సంవత్సరానికి రూ. 15,000.
విద్యార్హత సంబంధిత సబ్జెక్టులను బ్యాచిలర్ డిగ్రీలో చదివుండాలి. సైకాలజీకి మాత్రం ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీలో సైన్స్ గ్రూపులవారు ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సులో చేరవచ్చు.
ఎంబీఏః రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఏపీ లేదా తెలంగాణ ఐసెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 45 శాతం చాలు. కోర్సు ఫీజు మొదటి ఏడాదికి రూ. 15300. రెండో సంవత్సరానికి రూ. 15000.
ఎంఎల్ఐఎస్సీ ఈ కోర్సుకు 40 శాతం మార్కులతో బీఎల్ఐఎస్సీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్స్ వ్యవధి ఏడాది. ట్యూషన్ ఫీజు రూ. 10,300.
బీఎల్ఐఎస్సీః గ్రాడ్యుయేషన్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 45 శాతం. కోర్సు వ్యవధి ఏడాది. ఫీజు రూ. 5300.
ఎంకాంః బీకాం, బీబీఏ, బీబీఎం, బీఏ (కామర్స్) వీటిలో ఏదైనా కోర్సు చదివినవారు చేరవచ్చు. ఫీజు రెండేళ్లకు వరుసగా రూ. 7800, రూ. 7500.
పీజీ డిప్లొమాః మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, బిజినెస్ ఫైనాన్స్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, రైటింగ్ ఫర్ మాస్ మీడియా ఇన్ తెలుగు, హ్యూమన్ రైట్స్, ఉమెన్ స్టడీస్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం. ఒక్కో కోర్సు వ్యవధి ఏడాది.
విద్యర్హత ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
సర్టిఫికెట్ః ఫుడ్ అండ్ న్యూట్రిషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్జీవోస్ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. కోర్సుల వ్యవధి అరు నెలలు. కోర్సును బట్టి వీటిని పదోతరగతి, ఇంటర్, ఎలాంటి విద్యార్హతలు లేకుండా అందిస్తున్నారు.
యూజీలో:
బీఏ, బీఎస్సీ కోర్సులను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది. బీకాం తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో అందుబాటులో ఉంది. కోర్సుల వ్యవధి మూడేళ్లు. యూజీ కోర్సులకు ట్యూషన్ ఫీజు మొదటి ఏడాది రూ. 2,700, తర్వాత రెండేళ్లు ఏడాదికి రూ. 2,00 చొప్పున చెల్లించాలి. అలాగే సైన్స్ కోర్సుల్లో చేరినవారు ల్యాబ్ ఫీజు చెల్లించాలి. యూజీ కోర్సులను చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) విధానంలో నిర్వహిస్తున్నారు. ఏడాదికి రెండు సెమిస్టర్లు చొప్పున ఉంటాయి. విభాగాలవారీ యూజీలో అందుబాటులో ఉన్న సబ్జెక్టుల వివరాలు...
కళలు(ఆర్ట్స్) తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యం, ఉర్దూ సాహిత్యం:
సోషల్ సైన్స్‌స్ (సామాజిక శాస్త్రాలు) అర్ధశాస్త్రం, చరిత్ర, రాజనీతి శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, ప్రభుత్వ పాలన శాస్త్రం, సమాజ శాస్త్రం, జర్నలిజం.
విజ్ఞానశాస్త్రాలు (సైన్స్) వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, భూగర్భశాస్త్రం.
వాణిజ్య శాస్త్రం కామర్స్:
విద్యార్హత యూజీ కోర్సులకు ఇంటర్ పూర్తి చేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా, రెండేళ్ల ఒకేషనల్/ ఐటీఐ కోర్సులు చదివనవారూ అర్హులే. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ చదివినవారికీ అవకాశం ఉంటుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది జులై 31. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇది చదవండి: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2025 పూర్తి సమాచారం.!